News March 19, 2025

సెన్సార్లు అమర్చాలని అనకాపల్లి కలెక్టర్ సూచన 

image

పరిశ్రమలలో రసాయనాల లీకేజ్ లను గుర్తించే సెన్సార్లను బయట లోపల అమర్చాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే సమాచారాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియ చేయాలన్నారు. జిల్లాలో గల 12 రసాయన పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

Similar News

News March 19, 2025

సునీత.. మీరు పట్టుదల అంటే ఏంటో చూపించారు: మోదీ

image

ISS నుంచి భూమిపైకి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములను PM మోదీ ప్రశంసించారు. ‘వెల్కమ్ బ్యాక్ crew9. మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది. పట్టుదల అంటే ఏంటో చూపించారు. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. అంతరిక్ష అన్వేషణ అంటే సామర్థ్యానికి మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం, కలల్ని నిజం చేసుకునే ధైర్యం ఉండటం. సునీత ఒక ఐకాన్. వారిని సురక్షితంగా తీసుకొచ్చిన వారి పట్ల గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.

News March 19, 2025

నిజాంపేట: తల్లిదండ్రులు మందలించడంతో యువకుడి సూసైడ్ UPDATE

image

నిజాంపేట మండలం కేంద్రానికి చెందిన యువకుడు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గరుగుల భాను(18) ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ కావడంతో ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో మస్తాపానికి గురైన భాను మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 19, 2025

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!