News August 31, 2024

సెప్టెంబర్ 11 నుంచి ఉచిత ఇసుకకు నూతన విధానం

image

సెప్టెంబర్ 11 నుంచి ఆన్లైన్ ద్వారా ఉచిత ఇసుకకు నూతన విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం రాత్రి సచివాలయంలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులతో మాట్లాడారు. ఇసుకకు సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599ను విస్తృతంగా ప్రచారం చేయాలని మీనా ఆదేశించారు.

Similar News

News November 17, 2024

మద్యం మత్తులో కిందపడి యువకుడి మృతి

image

గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ సాకేత్ అనే యువకుడు మద్యం మత్తులో జారి రోడ్డుపై పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ సాకేత్ కొత్తపేట సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో స్టోర్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. అతిగా మద్యం తాగి జారి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News November 17, 2024

అనంత: బీజేపీ కార్యకర్తపై వేట కొడవలితో దాడి

image

బొమ్మనహాల్ మండలం చంద్రగిరికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిపై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు వేట కొడవలితో దాడి చేసి నరికారు. దాడిలో కృష్ణమూర్తి శెట్టి తల, వీపు, చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బళ్లారి ఆసుపత్రికి తరలించారు. భూ తగాదా వల్లే దాడి జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 17, 2024

అపార్ జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

అపార్ జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అనంతపురంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అపార్ జనరేషన్ ప్రక్రియపై డిఇఓ, డివిఈవో, ఆయా కళాశాల ప్రిన్సిపల్, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు అపార్ జనరేషన్ జరిగిన చర్యలు తీసుకోవాలన్నారు.