News April 21, 2025

‘సేంద్రియ విధానంల సాగు శుభ పరిణామం’

image

నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రైతు అనుబంధ సంఘాలు సోమవారం రైతు మహోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేంద్రియ విధానంలో రైతులు పంటలు సాగు చేయడం శుభ పరిణామం అన్నారు. జిల్లా అధికారులు, మంత్రులు, కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, 5 జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు.

Similar News

News April 22, 2025

BPL: చోరీకి పాల్పడిన మహిళ, మైనర్ల అరెస్ట్: CI

image

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో పెండ్లి బరాత్ సమయంలో జ్యోతి అనే మహిళ ఇంట్లో ఎవరూ లేరు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి బంగారం, డబ్బులు దొంగతనం చేసిన స్వప్న, మరో ఇద్దరు మైనర్లను CC టీవీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. సోమవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 22, 2025

NGKL: జైలుకు గ్యాంగ్ రేప్ నిందితులు

image

ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై గ్యాంగ్ రేప్ చేసిన ఏడుగురు నిందితుల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. కల్వకుర్తి డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏడుగురిని కస్టడీ తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. నిందితులు దేవాలయం సమీపంలో గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు.

News April 22, 2025

భీంపూర్: రైతు బిడ్డకు బ్యాంక్ మేనేజర్ కొలువు

image

భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన అడెపు అశోక్, కళావతి వారికి ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేస్తూ.. కూలి పనులు చేసుకుంటున్నారు. వారి కొడుకు శ్రీకాంత్ సోమవారం వెలువడిన బ్యాంక్ ఫలితాల్లో సత్తాచాటారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు శ్రీకాంత్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!