News August 2, 2024
సైబర్ క్రైం.. MBNR కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్.. కేసు నమోదు
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఏకంగా మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర పేరు, ఆమె ఫొటోతో ఫేక్ అకౌంట్ సృష్టించి సోషల్ మీడియాలోకి వదిలారు సైబర్ నేరగాళ్ళు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. +94784605962 నంబర్‌తో ఓ నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించారని ఆమె తెలిపారు.
Similar News
News November 29, 2024
డాటా ఎంట్రీలో పొరపాట్లకు తావు ఇవ్వవద్దు: కలెక్టర్ సంతోష్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే డాటా ఎంట్రీలో ఆపరేటర్లు ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఆయన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సర్వే ఆన్లైన్ నమోదు ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ ఎంట్రీ సమయంలో ఎన్యుమరేటర్లు ఆపరేటర్లకు అందుబాటులో ఉండాలన్నారు. డాటా ఎంట్రీ కి అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సిద్ధం చేయాలన్నారు.
News November 29, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!
✔మొదలైన రైతు పండుగ.. ప్రారంభించిన మంత్రులు
✔ఘనంగా బాపూలే వర్దంతి వేడుకలు
✔రేపు దీక్ష దివాస్.. తరలిరండి:BRS
✔NRPT:కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
✔కొల్లాపూర్‌లో విజయ్ దేవరకొండ సందడి
✔MBNR:RTC RMగా సంతోష్ కుమార్
✔రేపు నాగర్ కర్నూల్‌కు కేటీఆర్ రాక
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔మిడ్డే మీల్స్ ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలి:CITU
✔NRPT:నూతన DEOగా గోవిందరాజులు
✔రైతు సదస్సు..పాల్గొన్న MLAలు,రైతులు
News November 28, 2024
NRPT: ‘సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే చర్యలు’
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. కుల, మత, ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఇతరుల మనోభావాలు కించపరిచేలా వాట్స్ అప్, ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాపై ఐటి పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు.