News April 1, 2025

సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించండి: SP

image

జహీరాబాద్ పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలో ఉన్న రికార్డులను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హిస్టరీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులు అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

Similar News

News April 3, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యంశాలు.!

image

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.➤కొత్త జంటకు YS జగన్ ఆశీర్వాదం➤కమిటీల్లో అన్ని వర్గాలకు చోటు: YCPనేతలు➤బ్యాడిగ మార్కెట్లో వర్షం.. తడిసిన మిరప➤ కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి➤ నంది అవార్డు గ్రహీతకు సబ్ కలెక్టర్ అభినందన➤ భూములను కబ్జా చేయడానికి వక్ఫ్ సవరణ: మాజీ MLA హఫీజ్➤ కర్నూలు: నాయకులతో జగన్ సెల్ఫీ.!➤ జిల్లాలో దంచికొట్టిన వర్షాలు➤కౌతాళంలో సబ్ కలెక్టర్ పర్యటన.

News April 3, 2025

సిద్దిపేట: డివిజన్ అధికారులతో డీఎంహెచ్ఓ సమావేశం

image

DMHO డాక్టర్ పల్వాన్ కుమార్ జిల్లా కార్యాలయంలో డిప్యూటీ డిఎంహెచ్వో, ప్రోగ్రాం ఆఫీసర్లకు వివిధ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై, PC&PNDT, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పైన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రేపటి నుంచి డివిజన్ల వారిగా, డిప్యూటీ DMHOలు, ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరుపై ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నట్లు, ఆసుపత్రిలో ఆరోగ్య సేవలకు సంబంధించిన ఆయా అంశాలను పరిశీలించాలని ఆదేశించారు.

News April 3, 2025

రికార్డు సృష్టించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని జనరల్ మేజేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా తెలిపారు. 259.254 మిలియన్ల టన్నుల సరకు రవాణ చేసి కొత్త బెంచ్‌మార్క్‌ను దాటిందని వెల్లడించారు. గతంలో ఉన్న 259 మిలియన్ల టన్నుల మార్కుని దాటిని దేశంలోని మొదటి రైల్వే జోన్‌గా ECoR అవతరించిందని పేర్కొన్నారు. 

error: Content is protected !!