News February 7, 2025

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అనకాపల్లి ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. గురువారం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల సమస్యపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా జరక్కుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Similar News

News February 7, 2025

TCS ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేలో భారీ కోత

image

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 2024-25 Q3లో వారి వేరియబుల్ పేలో భారీ కోత పెట్టినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ వరుసగా రెండో క్వార్టర్‌లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అలవెన్స్ ఇవ్వగా, Q2లో 20-40 శాతానికి పరిమితం చేసింది. తనకు 50K-55K రావాల్సి ఉండగా Q2లో సగం, Q3లో ఇంకా తగ్గిందని ఓ ఉద్యోగి చెప్పారు.

News February 7, 2025

ఎన్నికలకు సిద్ధం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు

image

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకీ సిద్ధం అని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. గురువారం వనపర్తిలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అన్నారు.

News February 7, 2025

బాలానగర్‌: విద్యార్థి మృతి.. కేసు నమోదు

image

బాలానగర్ మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థి ఆరాధ్య ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి గురువారం మధ్యాహ్నం విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. విద్యార్థి తండ్రి కొమ్ము రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లెనిన్ గౌడ్ తెలిపారు.

error: Content is protected !!