News February 8, 2025

సోన్: నిజాయితీని చాటుకున్న ఉపాధ్యాయులు

image

నిర్మల్ మండలం కౌట్ల (కె) గ్రామానికి చెందిన గురుకుల ఉపాధ్యాయులు భూమేష్, శ్రీధర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం వారు సోన్ వైపు వెళ్తుండగా వారికి ఓ పర్సు దొరికింది. అందులో ఉన్న రూ.5000 ఉన్నాయి. ఆధార్ కార్డు ఆ పర్సు ఎవరిదో కనుక్కొని సదరు మహిళకు అందజేశారు. 

Similar News

News February 9, 2025

శుభ ముహూర్తం (09-02-2025)

image

✒ తిథి: శుక్ల ద్వాదశి రా.8.13 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర రా.6.53 వరకు
✒ రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.00 వరకు
✒ యమగండం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25 నుంచి సా.5.13 వరకు
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: ఉ.9.09 నుంచి ఉ.10.41 వరకు

News February 9, 2025

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

కర్నూలులోని సంకల్పాగ్‌ వద్ద ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. గత నెల 30న ధ్వజావరోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పది రోజులపాటు వైభవంగా నిర్వహించారు. పవిత్ర తుంగభద్ర నదిలో మీద పండితులు స్వామి వారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షి మాడవీధుల్లో ప్రదక్షణ చేసింది.

News February 9, 2025

హైదరాబాద్‌ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

image

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.

error: Content is protected !!