News March 29, 2025
సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు, అధికారులందరూ గమనించాలని ఆయన కోరారు.
Similar News
News April 2, 2025
2019లోనూ నలుగురు MLAలను గెలిపించారు: లోకేశ్

AP: ప్రకాశం జిల్లా అంటే ప్రేమ, పౌరుషం గుర్తొస్తాయని మంత్రి లోకేశ్ అన్నారు. 2019లో TDPకి రాష్ట్రంలో ఎదురుగాలి వీచినా, జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. TDP, చంద్రబాబు అంటే ఈ జిల్లా ప్రజలకు చాలా గౌరవం ఉందన్నారు. యువగళం పాదయాత్ర ప్రకాశంలో ఓ ప్రభంజనంలా నడిచిందని, అప్పుడు జిల్లా ప్రజల కష్టాలు చూసినట్లు చెప్పారు. ఆ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు.
News April 2, 2025
రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించండి: కలెక్టర్

రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అర్హులైన యువత ఆన్‌లైన్లో దరఖాస్తు చేసి, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పిస్తే, వాటిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్‌లైన్ చేస్తామని తెలియజేశారు. అధికారులు ప్రజలకు అవగహన కల్పించాలన్నారు.
News April 2, 2025
స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులు జోక్యం చేసుకోవాలి: రోహత్గి

TG: ఫిరాయింపు MLAల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశమని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని స్పీకర్‌కు చెప్పలేమా అని జస్టిస్ BR గవాయ్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ప్రశ్నించారు.