News April 2, 2025

స్టేట్‌ టాప్‌‌గా కామారెడ్డి ఆర్టీఏ

image

రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచిందని డీటీఓ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈ సారి రూ.73 కోట్లకు రూ.68.19 కోట్లు (92.4%) వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో సిబ్బంది ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు.

Similar News

News April 5, 2025

CSKvsDC: టాస్ గెలిచిన ఢిల్లీ.. జట్లు ఇవే

image

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
CSK: రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్, విజయ్ శంకర్, జడేజా, ధోని, అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్, మతీషా పతిరణ
DC: మెక్‌గర్క్, KL రాహుల్, పోరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, అశుతోష్, విప్రజ్, స్టార్క్, కుల్దీప్, మోహిత్ శర్మ

News April 5, 2025

ఈ అవార్డు భారతీయులకు అంకితం: మోదీ

image

శ్రీలంక తనకు ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం ‘మిత్ర విభూషణ’ను 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర దిసనాయకే చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు శ్రీలంక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు రక్షణ రంగానికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు MoU కుదుర్చుకున్నారు.

News April 5, 2025

ప్రతి ఇంట్లో వ్యాపారవేత్త ఉండాలి : నెల్లూరు మంత్రి

image

2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విజయవాడలో జరిగిన మెప్మా వన్ డే వర్క్ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే మెప్మా లక్ష్యమని తెలిపారు. ఈ వర్క్ షాపులో నారాయణతో పాటు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు.

error: Content is protected !!