News January 28, 2025

స్టేట్ స్పోర్ట్స్ మీట్‌కు నిర్మల్ జిల్లా పోలీసులు

image

ఇటీవల అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీటింగ్‌కు 16 మంది వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయ్యారని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో వారిని అభినందించారు. స్టేట్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ చాటి మెడల్స్ తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆల్ ఇండియా లెవల్‌కు ఎంపిక కావాలని కోరారు.

Similar News

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. సంగారెడ్డి జిల్లా ఎదురుచూస్తోంది..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మంజీరా నదిలో నక్క వాగు నీళ్లు కాలుష్యం కాకుండా చూడాలి. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలి. ప్యారానగర్ డంప్ యార్డు రద్దు చేయాలి. సింగూరు జిల్లా మొత్తం నీళ్లు తాగుకు, సాగుకు అందించాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి.

News March 12, 2025

కరీంనగర్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన కరుణాకర్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ మండడం మహ్మాదాపూర్‌కి చెందిన నర్సింహాచాలి ఆనారోగ్యంతో ఉరేసుకున్నాడు. మానకొండూర్ మండలం పోచంపల్లికి చెందిన అంజయ్య మానసిక స్థితి సరిగా లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 12, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు (బుధవారం) విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వల్లభనేని వంశీ పై పలు కేసులు నమోదయ్యాయి.

error: Content is protected !!