News February 24, 2025
స్టేషన్ ఘనపూర్: యువత సరైన మార్గంలో ప్రయాణించాలి: ఎంపీ కావ్య

యువత సరైన మార్గంలో ప్రయాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఇప్పగూడెం గ్రామానికి చెందిన యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎంపీని కలిశారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News February 24, 2025
క్షమాపణలు చెప్పిన ఐఐటీ బాబా

ఇండియాపై పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ ఫొటోలను Xలో షేర్ చేశారు. ఇది పార్టీ టైమ్ అని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. కాగా మహాకుంభమేళాలో ఈ బాబా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
News February 24, 2025
బెల్లంపల్లి: 2 రోజులు మద్యం షాపులు బంద్

MLC ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయనున్నట్లు బెల్లంపల్లి ఎక్సైజ్ CIఇంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఈనెల 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 24, 2025
అనకాపల్లి జాతరపై పవన్‌కు వినతి

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన సోమవారం వినతిపత్రం అందజేశారు. కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబికా అమ్మవారి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు.