News March 22, 2025
స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణ హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.
Similar News
News March 25, 2025
BREAKING: దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు గల్లంతు

నల్గొండ జిల్లా దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నేటి ఉదయం ఆరుగురు యువకులు దండెంపల్లి SLBC కాలువలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
ఉచిత ఇళ్లపై సీఎం కీలక ప్రకటన

AP: వచ్చే ఐదేళ్లలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ల సదస్సులో పునరుద్ఘాటించారు. ఇప్పటికే స్థలం పొందిన వారు కోరిన విధంగా ఇంటి పట్టాలు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 25, 2025
అనుష్క ‘ఘాటి’ మూవీ రిలీజ్ వాయిదా!

క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఘాటి’. ఈ సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీఎఫ్ఎక్స్ పనులే ఆలస్యానికి కారణమని వెల్లడించాయి. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉంది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో అనుష్క లుక్ భయపెట్టేలా ఉంది.