News March 23, 2025

స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

image

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.

Similar News

News March 26, 2025

చిన్న మేరంగి జంక్షన్ వద్ద ఏనుగుల బీభత్సం

image

పార్వతీపురం మన్యం జిల్లా జీఎంవలస చిన్నమేరంగి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిన్న మేరంగి జంక్షన్ కూరగాయల మార్కెట్‌ ఉన్న షాపులు గజరాజులు ధ్వంసం చేశాయి. కూరగాయలన్నీ నేలమట్టం అవడంతో షాపు యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు. ధ్వంసమైన షాపులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News March 26, 2025

HYDలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. RAIDS

image

HYDలో వ్యభిచార ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం వేరు వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌‌లో బంగ్లా యువతితో వ్యభిచారం చేయించడం గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కార్తీక్, ఓ కస్టమర్‌, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్శిస్తున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోనూ ఉగాండ యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు.

News March 26, 2025

HYDలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. RAIDS

image

HYDలో వ్యభిచార ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌‌లో బంగ్లా యువతితో వ్యభిచారం చేయించడం గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కార్తీక్, ఓ కస్టమర్‌, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్శిస్తున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోనూ ఉగాండా యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు.

error: Content is protected !!