News August 3, 2024

స్వచ్ఛదనం-పచ్చదనం సక్సెస్ చేయాలి: కలెక్టర్

image

అధికారులు సమన్వయంతో కృషి చేసి స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MBNR కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. కార్యక్రమంలో చేపట్టవాల్సిన వివిధ అంశాలపై కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆమె వెబెక్స్ సమావేశం నిర్వహించారు. 5రోజులపాటు జరగనున్న కార్యక్రమం పటిష్టంగా నిర్వహించేందుకు జడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తూ, అందరిని భాగస్వాములను చేయాలని సూచించారు.

Similar News

News November 29, 2024

డాటా ఎంట్రీలో పొరపాట్లకు తావు ఇవ్వవద్దు: కలెక్టర్ సంతోష్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే డాటా ఎంట్రీలో ఆపరేటర్లు ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఆయన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సర్వే ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్ ఎంట్రీ సమయంలో ఎన్యుమరేటర్లు ఆపరేటర్లకు అందుబాటులో ఉండాలన్నారు. డాటా ఎంట్రీ కి అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సిద్ధం చేయాలన్నారు.

News November 29, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔మొదలైన రైతు పండుగ.. ప్రారంభించిన మంత్రులు
✔ఘనంగా బాపూలే వర్దంతి వేడుకలు
✔రేపు దీక్ష దివాస్.. తరలిరండి:BRS
✔NRPT:కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
✔కొల్లాపూర్‌లో విజయ్ దేవరకొండ సందడి
✔MBNR:RTC RMగా సంతోష్ కుమార్
✔రేపు నాగర్ కర్నూల్‌కు కేటీఆర్ రాక
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔మిడ్‌డే మీల్స్ ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలి:CITU
✔NRPT:నూతన DEOగా గోవిందరాజులు
✔రైతు సదస్సు..పాల్గొన్న MLAలు,రైతులు

News November 28, 2024

NRPT: ‘సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే చర్యలు’

image

సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. కుల, మత, ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఇతరుల మనోభావాలు కించపరిచేలా వాట్స్ అప్, ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాపై ఐటి పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు.