News March 25, 2025

హనుమకొండ: కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ 

image

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ నగరంలోని పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్‌లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జీ ప్లస్‌ టు కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి స్థాయిలో పనుల పురోగతిని బ్లూ ప్రింట్ మాప్ ప్రకారం పరిశీలించారు. 

Similar News

News March 29, 2025

కొణిజర్ల: సాగర్ కాల్వలో మునిగి బాలుడు మృతి

image

సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు సాగర్ కెనాల్‌లో మునిగి కన్నుమూశాడు. కొణిజర్ల ఎస్ఐ సూరజ్ తెలిపిన వివరాలు.. తనికెళ్లకు చెందిన బత్తుల కనకారావు కుమారుడు సాయి(15) స్థానిక జెడ్పీహెచ్ఎస్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఒక పూట బడికి వెళ్లొచ్చిన ఆయన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ సమీపాన బోనకల్ బ్రాంచి కెనాల్‌లో ఈతకు వెళ్లాడు. అయితే, కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగి మృతి చెందాడు.

News March 29, 2025

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

News March 29, 2025

VJA: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

image

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో కృష్ణా జిల్లా అవినిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్షలాది లభ్యమయ్యాయి. మరిన్ని బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.

error: Content is protected !!