News March 14, 2025

హనుమకొండ: చెడుపై విజయమే హోలీ: కలెక్టర్  

image

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెడుపై విజయమే హోలీ అర్థం అన్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 15, 2025

పవన్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

image

బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం <<15762616>>పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు<<>> నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, తల్లిని కాపాడుకునే ప్రయత్నమనే విషయాన్ని పవన్‌కి దయచేసి ఎవరైనా చెప్పాలని ప్రకాశ్ రాజ్ కోరారు.

News March 15, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 15, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 15, 2025

బాసరలో వెయ్యి ఏళ్ల నాటి విగ్రహాలు

image

బాసర సరస్వతి నిలయంగా పేరుగాంచిన పాపహారేశ్వర స్వామి దేవాలయం వద్ద వేయ్యి ఏళ్ల నాటి విగ్రహాలు ఆదరణ లేకుండా నిర్లక్ష్యంగా పడి ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు, స్థానిక చరిత్రకారులు శుక్రవారం ఆలయ పరిసరాలను పరిశీలించారు. అక్కడ చారిత్రక ఆనవాళ్లు, విగ్రహాలు, శాసనాలు ఉన్నట్లు గుర్తించి వాటిని పరిశీలించారు.

error: Content is protected !!