News March 21, 2025
హనుమకొండ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించాలి
✓ ACBకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
✓ ముల్కనూరు: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు
✓ HNK: రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన వ్యక్తి మృతి
✓ HNK: అక్రమ రవాణాపై బస్టాండ్లో ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన
✓ ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించిన దామెర పోలీసులు
Similar News
News March 28, 2025
ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

జిల్లాలో విశ్వావస నామ తెలుగు సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌లో ఉగాది ఉత్సవ వేడుకలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్‌వో రాము నాయక్, తదితరులు ఉన్నారు.
News March 28, 2025
ఒంగోలు: వివాదాలకు కేంద్ర బిందువుగా బాలినేని

అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
News March 28, 2025
ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.