News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 26, 2025
సంగారెడ్డి: 26, 27న ఆ విద్యా సంస్థలకు సెలవు

పోలీస్ కేంద్రాలు ఉన్న పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 26, 27న సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. 26న ఈనెల ఎన్నికల ఏర్పాట్లకు, 27న పోలింగ్ కోసం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధానోపా ధ్యాయులు, ప్రిన్సిపల్స్ గమనించాలని కోరారు.
News February 26, 2025
నేనైనా లింగ వివక్షను ఎదుర్కోవాల్సిందే: జ్యోతిక

హీరో సూర్య భార్యగా తానూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు నటి జ్యోతిక చెప్పారు. ‘సూర్యని పెళ్లి చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలినని ఏదైనా ఇంటర్వ్యూలో చెబితే ప్రజలు అతడు మంచివాడని అంటారు. నన్ను పెళ్లి చేసుకొని సూర్య సంతోషంగా ఉన్నాడని చెప్పినా అతడినే పొగుడుతారు. ఇందులో నేనెక్కడా కనిపించను. ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది’ అని తాను నటించిన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో తెలిపారు.
News February 26, 2025
సుల్తానాబాద్ : ప్రేమ పేరుతో వేధించిన యువకుడికి జైలు

సుల్తానాబాద్ మండలంలోని పూసాలకు చెందిన యువకుడికి జైలుశిక్ష పడింది. మియాపూర్ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో ఇబ్బందికి గురిచేశాడని బాధితురాలు తండ్రికి తెలపడంతో అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువైనందున కోర్టు నెలరోజులు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించింది.