News April 22, 2025

హనుమకొండ: తేలనున్న 39,980 మంది విద్యార్థుల భవితవ్యం!

image

హనుమకొండ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 39,980 మంది విద్యార్థులు ఉన్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 18,397 మంది, ఒకేషనల్ 1,146, ద్వితీయ సంవత్సరం జనరల్-19,480, ఒకేషనల్-957 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT

Similar News

News April 22, 2025

అచ్చంపేట: స్టేట్ ర్యాంక్ సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని

image

పట్టణానికి చెందిన పిట్టల దశరథం, జ్యోతిల కుమార్తె పిట్టల స్నేహిత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 990 మార్కులతో.. స్టేట్ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్నేహిత భవిష్యత్‌లో ఇంజినీర్‌గా ఎదగాలి అనేది తన కోరిక అని తెలిపింది. ఆమెను కాలేజీ సిబ్బంది అభినందించారు.

News April 22, 2025

BRS మాజీ MLA చెన్నమనేనిపై CID కేసు

image

TG: వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనేదానిపై ఈ కేసు నమోదైంది. జర్మనీ పౌరసత్వాన్ని దాచి ఆయన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐడీ FIR నమోదు చేసింది.

News April 22, 2025

Inter ఫలితాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ర్యాంకులివే

image

ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌ రిజల్ట్స్‌లో ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 69.94 శాతం సాధించి 4వ స్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 62.45 శాతం సాధించి 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో ఖమ్మం 76.81 శాతం సాధించి 5వ స్థానం, భద్రాద్రి కొత్తగూడెం 72.43 శాతంతో 9వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!