News March 20, 2025

హనుమకొండ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

Similar News

News March 21, 2025

ఇచ్ఛాపురంలో లారీ దొంగతనం

image

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం రోజున రాత్రి ఇచ్ఛాపురం మండల కేంద్రంలో నిలిపి ఉన్న లారీని ఎవరో దొంగలించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. 

News March 21, 2025

కర్నూలులో TDP నేత దారుణ హత్య.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

image

రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు, వర్గ పోరుతోనే TDP నేత సంజన్నను హత్య చేశారని SP విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. కర్నూలులోని శరీన్ నగర్లో ఈనెల 14న సంజన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో వడ్డే ఆంజనేయులు, శివకుమార్, తులసి, రేవంత్, అశోక్‌ ఉన్నారని పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కార్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News March 21, 2025

UPI పేమెంట్స్‌ సబ్సిడీ ఎత్తివేతపై ఇండస్ట్రీ ఆందోళన

image

రూపే డెబిట్ కార్డులకు GOVT సబ్సిడీ విత్‌డ్రా చేసుకోవడంపై డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ ఆందోళన చెందుతోంది. ఏటా రూ.500-600CR మేర నష్టం తప్పదని అంచనా వేస్తోంది. FY25లో స్మాల్ మర్చంట్స్ UPI పేమెంట్స్‌‌కే కేంద్రం రూ.1500CR కేటాయించింది. గత ఏడాదీ ఇండస్ట్రీ రూ.5500 కోట్లను ఆశించగా రూ.3,681CR ఇవ్వడం గమనార్హం. జీరో MDR వల్ల రూపే కార్డులపై వచ్చే నష్టాన్ని బ్యాంకులు, Fintechsకి కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది.

error: Content is protected !!