News March 13, 2025
హనుమకొండ: ప్రచార పత్రికలను ఆవిష్కరించిన డీఈవో

ఇస్రో విద్యార్థులకు నిర్వహిస్తున్న యువిక-2025 ప్రచార పత్రికలను హనుమకొండ డీఈవో వాసంతి, ఇస్రో ట్యూటర్‌గా ఎంపికైన భూపతి శశాంక్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సాహించాలని డీఈవో వాసంతిని శశాంక్ కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈవో ప్రధానోపాధ్యాయులతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు.
Similar News
News March 14, 2025
WOW.. గ్రూప్స్‌లో సత్తాచాటిన సిద్దిపేట బ్రదర్స్

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతుల కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నోడు హరికృష్ణ గ్రూప్-2లో 184 ర్యాంక్ సాధించారు.
News March 14, 2025
GROUP-1 రిజల్ట్.. టీజీపీఎస్సీ కీలక సూచన

TG: గ్రూప్-1 ఫలితాల్లో టాప్-500లో 45.6% మంది బీసీలే ఉన్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6% ఉన్నట్లు వెల్లడించింది. ఫలితాలపై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించింది. మెరిట్ ప్రకారం, పారదర్శకంగా జాబితాను రిలీజ్ చేశామని తెలిపింది. రోస్టర్ ప్రకారమే పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. ప్రతి అన్సర్ షీట్‌ను ఇద్దరు ఎవాల్యుయేటర్లు మూల్యాంకనం చేసినట్లు పేర్కొంది.
News March 14, 2025
హోలీ పండుగ.. కోనసీమ ఎస్పీ సూచనలు

హోలీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సీసీటీవీల ద్వారా హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రంగులు చల్లటం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. హోలీలో ఎటువంటి రసాయనిక రంగులను వాడొద్దని ఎస్పీ సూచించారు.