News April 4, 2025
హనుమకొండ: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
Similar News
News April 8, 2025
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

APలో ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 12 లేదా 13న విడుదల చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. మార్చి 1 నుంచి 19 వరకు ఫస్టియర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు జరిగాయి. ఇటీవలే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తవగా, ఫలితాల్లో తప్పులు దొర్లకుండా మరోసారి అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఫలితాల విడుదలపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. bieap.gov.in, వే2న్యూస్ యాప్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చు.
News April 8, 2025
ఏప్రిల్ 7తో కృనాల్‌కు కనెక్షన్.. విజృంభణే!

వాంఖడేలో ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో కృనాల్ పాండ్య నాలుగు వికెట్లతో అదరగొట్టారు. అయితే, గత మూడేళ్లుగా ఏప్రిల్ 7న జరిగే మ్యాచుల్లో కృనాల్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో LSG తరఫున 3 వికెట్లు, 2024లో GTతో మ్యాచులోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. నిన్నటి మ్యాచులోనూ సత్తాచాటారు.
News April 8, 2025
సిట్ విచారణకు హాజరైన శ్రవణ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. HYD జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ విచారణకు A6గా ఉన్న శ్రవణ్ రావు హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఆయనను మరింత లోతుగా విచారించి, సమాచారం సేకరించాలని సిట్ భావిస్తోంది. గతంలో ఆయన ఎంక్వైరీకి సహకరించలేదని సిట్ వెల్లడించగా, నేటి విచారణపై ఆసక్తి నెలకొంది.