News February 25, 2025
హనుమకొండ: వైన్స్, బార్, రెస్టారెంట్లు బంద్: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి 27 వరకు హనుమకొండ జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్, రెస్టారెంట్లు, కల్లు డిపోలు మూసి వేస్తున్నామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 25, 2025
ఏలూరు: మసాజ్ సెంటర్ కేసులో నిందితుడు అరెస్ట్

ఏలూరులో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం నిర్వహించిన ఘటన ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు భాను ప్రసాద్ పోలీసులకు చిక్కాడు. సోమవారం సాయంత్రం అతణ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు.
News February 25, 2025
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ టీడీపీలోకి చేరిక

తునిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఛైర్ పర్సన్ ఏలూరు సుధారాణి రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఆరుగురు కౌన్సిల్ సభ్యులు టీడీపీ గూటికి చేరారు. తాజాగా సోమవారం సాయంత్రం హైదరాబాదులో యనమల దివ్య సమక్షంలో వైస్ ఛైర్మన్ కూచ్చర్లపాటి రూపా దేవి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ టీడీపీ బలం 16కు చేరుకుంది.
News February 25, 2025
విజయనగరం జిల్లాకు అరుదైన గుర్తింపు

జాతీయ భౌగోళిక పాలసీలో పైలట్ జిల్లాగా విజయనగరంను ఎంపిక చేయడం వలన స్థానికంగా ఉన్న అనేక అంశాలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం వర్క్ షాప్ నిర్వహించారు. దేశంలోని 5 రాష్ట్రాలలో 5 జిల్లాలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేయగా అందులో విజయనగరం ఒకటన్నారు. వివిధ శాఖల్లో పలు అంశాలకు సంబంధించి వచ్చే రెండు, మూడు నెలల్లో మంచి ఫలితాలను చూడబోతున్నామన్నారు.