News October 22, 2024

హన్మకొండ డీఎంహెచ్వో కీలక సూచనలు

image

హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలోని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్స్ సెంటర్స్ తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమాలను తప్పకుండా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని DMHO డా.లలితా దేవి తెలియచేశారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదలచేశారు. ఆయా యాజమాన్యాలు వివిధ సేవలకు సంబంధించిన తారీఫ్ లిస్టును తప్పకుండా విజిటర్స్‌కి కనిపించేలా ప్రదర్శించాలన్నారు.

Similar News

News November 17, 2024

WGL: నిరుద్యోగులకు ఈనెల 20న జాబ్ మేళా

image

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి శనివారం తెలిపారు. హెచ్‌డి‌ఎఫ్‌సిలో 50, ముత్తూట్ ఫిన్ కార్ప్‌లో 100, సర్వాగ్రామ్ ఫైనాన్స్‌లో 15 ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ వరంగల్ ఐటిఐ బాయ్స్ క్యాంపస్‌కు రావాలన్నారు.

News November 16, 2024

WGL: సీఎం పర్యటన పనులను పరిశీలించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, GWMC అశ్విని తానాజీ వాకడే శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

News November 16, 2024

హనుమకొండ జిల్లాలో చిరుత కలకలం!

image

హనుమకొండ జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. పరకాల మండలం రాజుపేట పంటపొలాల్లో చిరుత సంచరించినట్లు రైతులు అనుమానానిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని పరిశోధిస్తున్నారు.