News April 12, 2025
హన్మకొండ: వడదెబ్బతో తాపీ మేస్త్రి మృతి

హన్మకొండ జిల్లా దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బతో తాపీ మేస్త్రీ మల్లేశం(46) మృతి చెందారు. ఓ ఇంటి దాబాపై పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడని మల్లేశం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI అశోక్ తెలిపారు. వేసవి దృష్ట్యా కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని SI సూచించారు
Similar News
News April 13, 2025
వరంగల్: భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో జాతీయ రహదారి 163 భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో సంగెం, పర్వతగిరి, గీసుకొండ, నెక్కొండ మండలాల్లోని గ్రామాల్లో 38. 20 కిలో మీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News April 13, 2025
WGL: హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?..

వరంగల్(D) నల్లబెల్లి(M) మూడు చెక్కలపల్లిలో శనివారం బానోత్ కొమ్మలు(36) అనే వ్యక్తి <<16081736>>హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మొక్కజొన్న చేనులో కొమ్మలు మృతదేహం లభ్యమైంది. ఆయన శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది.
News April 13, 2025
WGL: అర్ధరాత్రి దారుణ హత్య..!

వరంగల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మలును గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కత్తితో పొడిచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.