News April 5, 2025
హన్మకొండ వాసులూ.. APPLY చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను హన్మకొండ జిల్లాలోని మీ MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE
Similar News
News April 6, 2025
కశింకోట: ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

కశింకోట మండలం నర్సింగబిల్లిలో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పి.బ్యూల (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు శనివారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
News April 6, 2025
7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

భీమవరంలోని కలెక్టరేట్‌లో ఈ నెల 7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని.. గమనించాలని కోరారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. కాగా పలు కారణాలతో గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే.
News April 6, 2025
నంద్యాల: మెగా జాబ్ మేళా

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 10న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఆపై చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఈ మేళాలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్కొంటారని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.