News February 23, 2025

హన్మాజీపేట పాఠశాల వజ్రోత్సవం.. సీఎం శుభాకాంక్షలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట పాఠశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖను విడుదల చేశారు. 75 ఏళ్లుగా అంకితభావం, శ్రద్ధ, పట్టుదలతో అనేకమంది విద్యార్థులకు ఈ పాఠశాల విద్యాబుద్ధులు నేర్పిందని అన్నారు. కవి, రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పునర్నిర్మించటం స్ఫూర్తి దాయకమన్నారు.

Similar News

News February 23, 2025

అనంతపురం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు ఇవే..!

image

☞ అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు – కలెక్టర్ వినోద్ కుమార్ ☞ పెద్దపప్పూరులో అశ్వర్థం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు ☞ అనంతపురం రూరల్‌లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత భూమి పూజ☞ గుత్తిలో ఇరు వర్గాలు ఘర్షణ ☞ కుందుర్పిలో గడ్డివాములు దగ్ధం ☞ గార్లదిన్నె మండలంలో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు☞ తాడిపత్రిలో సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి

News February 23, 2025

రేపు పవన్ సినిమా నుంచి సాంగ్

image

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. రేపు ఈ సినిమా నుంచి ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. రేపు మ.3 గంటలకు ఈ పాట విడుదలవుతుందని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను పంచుకుంది. పవన్, నిధి అగర్వాల్ మధ్య ఈ సాంగ్ నడవనున్నట్లు తెలుస్తోంది. మార్చి 28న ఈ సినిమా పార్ట్-1 విడుదల కానుంది.

News February 23, 2025

విద్యుత్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఎన్నిక

image

విద్యుత్ కార్మిక సంఘం మెదక్ జిల్లా నూతన గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సెక్రటరీ ఓరం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తనను గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వం, కంపెనీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

error: Content is protected !!