News April 15, 2025
హన్వాడ: ప్రజా ప్రభుత్వం రైతుల పక్షమే: ఎమ్మెల్యే

ప్రజా ప్రభుత్వం రైతుల పక్షంగానే ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హన్వాడ మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, ప్రతి గింజను కొనడమే కాకుండా గిట్టుబాటు ధర కల్పించామని, బోనస్ అందించామన్నారు.
Similar News
News April 16, 2025
బాలానగర్: ‘గల్లంతయిన రెండో వ్యక్తి మృతదేహం లభ్యం’

బాలానగర్ మండలంలోని గంగాధర్పల్లి గ్రామ శివారులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాలలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. నిన్న సాయంత్రం శివరాములు మృతదేహం లభ్యం కాగా.. బుధవారం ఉదయం యాదయ్య (25) మృతదేహం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 16, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి తీవ్రత రోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో కౌకుంట్ల 40.6 డిగ్రీలు, దేవరకద్ర 40.5 డిగ్రీలు, అడ్డాకుల, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 40.1 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లిలో 40.0 డిగ్రీలు, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 39.8 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 39.4 డిగ్రీలు, మూసాపేట మండలం జానంపేట 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News April 16, 2025
MBNR: డబ్బా మీద పడి మహిళ మృతి

మూసాపేట మండలంలో ఓ చిరువ్యాపారి నిర్వహిస్తున్న డబ్బా మీద పడి మహిళ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. వేముల గ్రామ శివారులోని ఓ కంపెనీ దగ్గర ఓ వ్యాపారి కిరాణా డబ్బాను నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా ఆ కంపెనీ దగ్గర అయ్యమ్మ(75) వరి ధాన్యాన్ని అరబెట్టుకుంటూ ఉండేది. నిన్న సాయంత్రం కురిసిన గాలివానకు ఆమె ఆ డబ్బా దగ్గర తలదాచుకుంది. ప్రమాదవశాత్తు ఆ డబ్బా ఆమె మీద పడటంతో అయ్యమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.