News March 4, 2025
హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్‌కి చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్‌రెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News March 4, 2025
మెదక్: చెల్లని ఓట్లతో అభ్యర్థుల్లో ఆందోళన !

కరీంనగర్‌లో పట్టభద్రుల MLCఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్నటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లు వేరు చేసి తాజాగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన పోలింగ్‌లో తొలి ప్రాధాన్య ఓట్లతో గెలుపు కష్టమేనని పలువురు అంటున్నారు. చెల్లని ఓట్లు అధికంగా కనిపించడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఓట్లతో ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని, ఎవరికి నష్టం కలిగిస్తాయో అన్న టెన్షన్ మొదలైంది.
News March 4, 2025
WGL: పెరిగిన మొక్కజొన్న, తగ్గిన పల్లికాయ ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు సోమవారం రూ.2,355 పలకగా.. నేడు రూ.2,360కి పెరిగింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి నిన్న రూ.5,500 ధర రాగా.. నేడు రూ.5,600 పలికింది. సూక పల్లికాయకి నిన్న రూ.7,500 ధర, నేడు రూ.6900కి పడిపోయింది.
News March 4, 2025
పాకిస్థానీ అని పిలవడం నేరం కాదు: సుప్రీం కోర్టు

మియాన్-తియాన్, పాకిస్థానీ అని పిలవడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఉర్దూ తర్జుమా ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరిగి ఉద్యోగిని పాకిస్థానీ అంటూ దరఖాస్తుదారుడు దూషించాడు. అతడిపై చర్యలకు ఝార్ఖండ్ కోర్టు ఆదేశించగా అతడు సుప్రీంను ఆశ్రయించాడు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా తీర్పు చెప్పింది.