News April 6, 2025
హరీశ్.. నీ లేఖల పురాణం ఆపు: బీర్ల ఐలయ్య

హరీశ్ రావును చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని MLA బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన రాసిన లేఖపై స్పందిస్తూ.. ‘పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న హరీశ్ ఇప్పుడు సుద్ద పూస మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ పాలన చేస్తుంటే హరీశ్ రావు లేఖల పేరుతో నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నాడు. రాహుల్ గాంధీకి, KCR కుటుంబానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని ఐలయ్య దుయ్యబట్టారు.
Similar News
News April 9, 2025
ధూల్‌పేటలో 90% గంజాయి బంద్..!

గంజాయి సరఫరాకు కేరాఫ్ అడ్రస్ అయిన HYD ధూల్‌పేటలో 90% గంజాయి అమ్మకాలు తగ్గిపోయినట్లు ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ ధూల్ పేట్లో భాగంగా 102 కేసులను నమోదు చేసి, 327 మందిని రిమాండ్‌కు పంపించారని, 13 మందిని బౌండోవర్ చేశారని, 85 మంది పరారీలో ఉన్నారన్నారు. 147 మొబైల్స్, 58 బైక్లు, 2 కార్లు స్వాధీనం చేసుకొని, 401 కేజీల గంజాయిని పట్టుకున్నారన్నారు.
News April 9, 2025
సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి భూమిపూజ

AP: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తన కొత్త ఇంటికి సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక వైపు E-9 రోడ్ పక్కన ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. మొత్తం 1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ+1 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సీఎం కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా గతేడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు 5 ఎకరాల స్థలం కొన్న విషయం తెలిసిందే.
News April 9, 2025
GOOD NEWS: గురుకులాల్లో కోడింగ్ కోర్సులు

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి 238 గురుకులాల్లో కోడింగ్ కోర్సులను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకోసం యూకే ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాది మెయినాబాద్ పాఠశాలలో మాత్రమే కోడింగ్ ట్రైనింగ్ ఉండేదని, ఇకపై అన్ని గురుకులాల్లో అమలు చేస్తామన్నారు.