News September 27, 2024
హస్త కళలను ప్రజలు ఆదరించాలి: భార్గవ్ తేజ
హస్త కళలను ప్రజలు ఆదరించి కళాకారులను మరింతగా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన చేనేత, హస్త కళా ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. కళాకారుల జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే క్రాఫ్ట్ బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
Similar News
News November 27, 2024
గుంటూరుకు నేడు ‘దేవకీనందన వాసుదేవ’ చిత్ర బృందం
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా నటించిన ‘దేవకీనందన వాసుదేవ’ చిత్రం విజయోత్సవ వేడుకలు బుధవారం గుంటూరులో జరగనున్నాయి. చిత్రబృందం కొరిటెపాడులోని హరిహరమహాల్‌కు సాయంత్రం 5.30గంటలకు విచ్చేస్తుందని అశోక్ సన్నిహితులు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వద్ద కేక్ కటింగ్ జరుగుతుందని, గల్లా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
News November 27, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.40 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి వెళ్తారు. అక్కడ 12.30 గంటలకు మారిటైం పాలసీపై సమీక్షిస్తారు. తిరిగి 04.0 గంటలకు ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీపై అధికారులతో సమీక్ష చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వచ్చే రూట్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
News November 27, 2024
వినుకొండ: టీడీపీ నేత కోడలి చీర మిస్సింగ్.. నోటీసులు జారీ
ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్‌లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడుతూ.. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్‌లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.