News March 18, 2025

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటిన నర్మాల మహిళ

image

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పి.లావణ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోన్-3 ఉమెన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. లావణ్య ఎంఎస్సీ బీఈడీ పూర్తిచేసి కేజీబీవీలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తోంది. గ్రూప్4లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగం చేస్తూనే హాస్టల్ వెల్ఫేర్ జాబ్‌కు ప్రిపేరై జాబ్‌ కొట్టింది.

Similar News

News December 14, 2025

నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

image

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.

News December 14, 2025

సంగారెడ్డి: మధ్యాహ్నం 1 వరకు 82.75 పోలింగ్

image

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఒకటి వరకు 82.75% పోలింగ్ నమోదయింది. మొత్తం 2,99,578 మంది ఓటర్లకు గాను 2,47,911 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 14, 2025

IPL మినీ ఆక్షన్‌.. ఈ ప్లేయర్‌కే అత్యధిక ధర?

image

ఎల్లుండి జరిగే IPL మినీ ఆక్షన్‌లో AUS ఆల్‌రౌండర్ గ్రీన్ అత్యధిక ధర పలకొచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా. ఈ వేలానికి ఆయన బ్యాటర్‌గా రిజిస్టర్ చేసుకోగా, మొదటి సెట్‌లోనే ఎక్కువ ప్రైస్ రావాలని అలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తన మేనేజర్ పొరపాటున ఆప్షన్ తప్పుగా పెట్టాడని, తాను బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ తెలిపారు. అత్యధిక పర్స్ ఉన్న (₹64.30Cr) KKR ఆయన్ను కొనే ఛాన్సుంది.