News March 9, 2025

హిందూపురం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

image

హిందూపురంలోని ఆటోనగర్‌లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్‌‌లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. బందువులు వారిని వెలికితీసి హిందూపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.

Similar News

News March 10, 2025

పెద్దపల్లి జిల్లాకు రూ.200 కోట్లు..!

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి రూ.200కోట్లు మంజూరు చేశారు.

News March 10, 2025

నామినేషన్లకు నేడే ఆఖరు..

image

TG: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలకు నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ రావు, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా 20న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఈసీ లెక్కింపు నిర్వహించనుంది.

News March 10, 2025

ప.గో: సంజయ్ దత్‌ను కలిసిన రఘురామ

image

ఏఎంఆర్ సంస్థ ఛైర్మన్ మహేశ్ రెడ్డి కుమారుడు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొని నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ రిసెప్షన్లో తన పాత మిత్రుడు సంజయ్ దత్‌ను కలిశారు.

error: Content is protected !!