News January 20, 2025

హిందూపురంలో భర్త హత్య.. భార్య, ప్రియుడి అరెస్ట్ 

image

తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా భార్య తబుసం, ప్రియుడు నదీముల్లాను అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. ఈ నెల 18న అల్లా బకాశ్ ఇంట్లో నిద్రిస్తుండగా భార్య తబుసం, ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపారని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని వివరించారు.

Similar News

News January 20, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు అనంతపురం ఎస్పీ సూచన

image

అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు వివిధ కారణాలతో గైర్హాజరైన వారికి మంగళవారం అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లాలో గత నెల 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రోజుల్లో గైర్హాజరు అయిన వారు రేపు పరీక్షల్లో పాల్గొనాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 20, 2025

అనంతపురం: ఎస్సీ వర్గీకరణపై వినతుల స్వీకరణ

image

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం ఏకసభ్య కమిటీ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అనంతపురం వచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో పలువురి నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం షెడ్యూల్ కులాల వర్గీకరణపై వివిధ కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

News January 20, 2025

అనంతపురం: ఏకసభ్య కమిషన్‌ను కలిసిన కలెక్టర్‌లు

image

ఎస్సీల ఉప వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాను రెండు జిల్లాల కలెక్టర్లు కలిశారు. సోమవారం అనంతపురం పట్టణంలోని R&B అతిథి గృహంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న తదితరులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.