News April 4, 2025

హీటెక్కిన రాప్తాడు రాజకీయం!

image

పరిటాల-తోపుదుర్తి కుటుంబాల మధ్య పొలిటికల్ హీట్ నెలకొంది. కొన్నిరోజులుగా సునీత, తోపుదుర్తి సోదరులు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 8న YS జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తుండగా పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం ఉందంటూ సునీత సంచలన ఆరోపణ చేశారు. వందలాది మందిని చంపించిన నీ భర్త దేవుడా? అంటూ చంద్రశేఖర్ ఇటీవల ప్రశ్నించారు. విమర్శ ప్రతి విమర్శలతో రాప్తాడు రాజకీయం హీటెక్కింది.

Similar News

News April 5, 2025

నేడు ముప్పాళ్లకు సీఎం చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు(M) ముప్పాళ్లలో జరిగే బాబు జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో CM మాట్లాడతారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

News April 5, 2025

రోహిత్ శర్మను ముంబై డ్రాప్ చేసిందా?

image

మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్ ఆడట్లేదని టాస్ సమయంలో హార్దిక్ చెప్పారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రోహిత్‌ను ముంబై డ్రాప్ చేసిందంటూ చర్చ నడుస్తోంది. ‘డ్రాప్డ్’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. జట్టుకు ఐదు కప్‌లు అందించిన ఆటగాడిని డ్రాప్ చేయడమేంటంటూ రోహిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తుండగా.. ఫామ్‌లో లేని రోహిత్‌ను డ్రాప్ చేసినా తప్పేంలేదంటూ ముంబై జట్టు ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

News April 5, 2025

LSG విజయం.. గోయెంకా సంతోషం..!

image

ఐపీఎల్‌లో ముంబైతో విజయం అనంతరం LSG ఓనర్ సంజీవ్ గోయెంకా చిరునవ్వులు చిందించారు. కెప్టెన్ రిషభ్ పంత్, సిబ్బందితో కలిసి ఆయన స్టేడియంలో సంతోషంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఎన్నాళ్లకెన్నాళ్లకు గోయెంకా నవ్వారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఎల్ఎస్‌జీని రెండు వరుస ఓటములు పలకరించడంతో రిషభ్ పంత్‌పై గోయెంకా సీరియస్ అయిన విషయం తెలిసిందే.

error: Content is protected !!