News June 4, 2024

హుజురాబాద్: MLAగా ఓడి ఎంపీలుగా గెలవబోతున్నారు

image

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్, కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్‌లు ఎమ్మెల్యేగా ఓటమి చెంది ఎంపీలుగా గెలువబోతున్నారు. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు లక్షలకు పైగా మెజార్టీతో దూసుకుపోతున్నారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష డెబ్బై వేలకు పైగా మెజార్టీతో ఉన్నారు.

Similar News

News October 1, 2024

KNR: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

జగిత్యాల జిల్లా DSC టాపర్‌గా జిందం అజయ్‌కుమార్

image

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోరుట్లకు చెందిన జిందం అజయ్‌కుమార్ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలో 80.3 మార్కులతో జగిత్యాల జిల్లా టాపర్‌గా నిలిచాడు. దీంతో ఆయన్ను బంధుమిత్రులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

News October 1, 2024

దొంగతనాల నివారణకు ఒక స్పెషల్ టీం: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలోని దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం నియమించి వాటిని నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్లను నిందితుడిపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుచేయడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.