News February 22, 2025
హుజూర్నగర్: డాబా పైనుంచి పడి యువకుడి మృతి

గరిడేపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సాయిరాం పనిచేస్తూ వనస్థలిపురంలో ఉంటున్నాడు. గురువారం రాత్రి హుజూర్నగర్ పట్టణంలోని తన స్నేహితుడు నరేశ్ వాళ్ల బావ ఓరుగంటి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. వారితో కలిసి డాబా ఎక్కి మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతిచెందినట్లు వారు తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు SI ముత్తయ్య కేసు నమోదు చేశారు.
Similar News
News February 23, 2025
SLBC టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, SP

SLBC టన్నెల్ ప్రమాద ఘటన స్థలాన్ని (నాగర్ కర్నూల్ జిల్లా, దోమలపెంట) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఏసీపీ మౌనిక, ఇతర అధికారులు ఉన్నారు.
News February 23, 2025
నల్గొండ జిల్లా టాప్ న్యూస్

✓ SLBC టన్నెల్ పైకప్పు కూలి సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ✓ G- 20 సదస్సుకు ఎంపికైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి ✓ కేతేపల్లిలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్ల మృతి ✓ ఉమ్మడి జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు ✓ తప్పుడు వార్త రాసిన విలేకరిపై చర్యలు తీసుకోవాలి: టీఎన్జీవో
News February 22, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్

NLG- KMM- WGL ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో 518 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు.