News February 23, 2025

హుస్నాబాద్: తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

image

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ ఉదంతం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో శనివారం జరిగింది. వ్యవసాయంలో నష్టం రావడంతో బోనాల శ్రీనివాస్ (46) అనే రైతు పురుగు మందు సేవించి శుక్రవారం ఆత్మహత్యయత్నం చేయగా, హనుమకొండలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. శ్రీనివాస్‌కు ఇరువురు కుమార్తెలు ఉండడంతో అందులో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టింది.

Similar News

News February 23, 2025

HYD: SLBC ప్రమాదం.. BRS సర్కార్ నిర్లక్ష్యం: చాడ 

image

SLBC వద్ద జరిగిన ప్రమాదంలో అనేక పరిణామాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. SLBC ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గమని, 20సార్లు మార్పులు చేయడం వల్ల సొరంగ మార్గం అంచనాలు పెరిగి మరింత ఆలస్యం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో పనులు చేపట్టకపోవడంపై కప్పు స్లాబ్ తుప్పు పట్టి ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యమన్నారు.

News February 23, 2025

టాసుల్లో టీమ్ ఇండియా ఓటముల పరంపర

image

టీమ్ ఇండియా టాసుల ఓటముల పరంపర కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులోనూ టాస్ ఓడింది. రోహిత్ ‘హెడ్స్’ అనగానే కాయిన్ రివర్స్‌లో పడింది. దీంతో వన్డేల్లో వరుసగా 12వ మ్యాచులోనూ భారత్ టాస్ పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌(11 టాస్ ఓటములు)ను భారత్ అధిగమించింది. ఇండియన్ టీమ్ 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు 12 సార్లు టాస్ గెలవలేకపోయింది.

News February 23, 2025

అమెరికా రాజకీయాల్లో తణుకు యువకుడు

image

అమెరికా రాజకీయాల్లో తణుకుకి చెందిన యువకుడు సత్తి ఆదిత్యరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల హోరా హోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంపైన్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు ఆర్మీ నేషనల్ గార్డ్‌గా పనిచేసిన ఆయన రిపబ్లిక్ పార్టీలో, ట్రంప్ ప్రభుత్వంలో అధికారిక హోదా పొందబోతున్నారు. వైట్ హౌస్‌లో జరిగే దాదాపు అన్ని కార్యక్రమాలకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

error: Content is protected !!