News March 28, 2025
హెలీప్యాడ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను శుక్రవారం ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ పనులను పూర్తి చేయాలని ఆర్& బీ ఇంజనీర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభా వేదిక వద్ద బ్యారికేడ్లలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ప్రజా వేదికను సౌకర్యవంతంగా తయారు చేయాలన్నారు
Similar News
News April 3, 2025
రాయితీ ఈ నెల వరకు: కలెక్టర్ హనుమంతరావు

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్ )లో 25 శాతం రాయితీని ఈ నెల వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 3, 2025
సంగారెడ్డి: 56 ఇళ్లకు ఇందిరమ్మ నిధులు విడుదల

జిల్లాలో బేస్ మీట్ వరకు పూర్తి చేసిన 56 ఇళ్లకు లక్ష చొప్పున రూపాయల నిధులు వారి ఖాతాలో జమ చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లో 1200 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు కూడా బేస్ మీట్ వరకు నిర్మిస్తే లక్ష చొప్పున నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు.
News April 3, 2025
పాయింట్స్ టేబుల్ టాప్‌లో పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025లో రెండు వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికల పంజాబ్ కింగ్స్ టాప్‌లో నిలిచింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి ఎరగకుండా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న ఆర్సీబీ.. గుజరాత్‌పై ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత GT, MI, LSG, CSK, SRH, RR, KKR కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే SRH vs KKR మ్యాచ్ తర్వాత సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది.