News June 20, 2024

హైదరాబాద్‌ నుంచి ZOO PARK తరలింపు.. క్లారిటీ!

image

HYD బహదూర్‌పురా నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్‌ తరలింపు‌‌ అవాస్తవం అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ విషయమై PCCF వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గెయిన్(తెలంగాణ మెంబర్) క్లారిటీ ఇచ్చారు. షాద్‌నగర్‌కు తరలిస్తున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవం అని‌ పేర్కొన్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన కూడా లేదని వివరణ ఇచ్చారు. కాగా,‌ జూ పార్కుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు.
SHARE IT

Similar News

News October 4, 2024

HYD: నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లా పర్యటన

image

PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే పర్యటన ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటి నుంచి నిజామాబాద్ బయలుదేరుతారు. ఆయన వెంట ఎనిమిది మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ సీనియర్ నేతలు ఉంటారని తెలిపారు.

News October 4, 2024

HYD: KTR.. SORRY చెప్పాలి: శ్రీనివాస్

image

మాజీ మంత్రి KTR వెంటనే మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలని TPCC ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. KTR తరచూ మహిళా ప్రజాప్రతినిధులను కించ పరుస్తున్నాడని మండిపడ్డారు. ఆయన తన BRS పార్టీ సోషల్ మీడియా ద్వారా కొండా సురేఖను ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ మంత్రి సీతక్కపై నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు.

News October 4, 2024

నాంపల్లి: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్

image

ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.