News February 23, 2025
హైదరాబాద్: సీఎం విజన్‌కు అనుగుణంగా చర్యలు: HMR MD

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాల్గో నగరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌ను అధికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య రహిత హరిత నగరంగా, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు HMR డీపీఆర్ సిద్ధం చేస్తోందని వెల్లడించారు.
Similar News
News February 24, 2025
ఢిల్లీని మించిన HYD.. జనాభాలో తగ్గేదేలే!

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
News February 24, 2025
HYD: AIతో 5 నిమిషాల్లో బిల్డింగ్ పర్మిషన్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో భవనాల నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్లు ఇచ్చేందుకు HMDA సిద్ధమవుతోంది. బిల్డ్ నౌ ఏఐ టెక్నాలజీ ద్వారా భవనాల అనుమతుల ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న TGBPASS ద్వారా 40 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చేందుకు 20-30 రోజుల సమయం పడుతుండగా, AI టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు.
News February 23, 2025
HYD: పిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..!

గ్రేటర్ HYD పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. POCSO చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 2022- 426, 2023- 559, 2024- 713 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదలపై పోలీసులు, సామాజిక సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న క్రైమ్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.