News December 25, 2024
హైదరాబాద్‌లో OYOకు ఫుల్ డిమాండ్!
HYD OYO బుకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం.. గల్లీల్లో ఉండే లాడ్జిలను సైతం అధునాతన హంగులతో తీర్చిదిద్ది, అందుబాటు ధరలకే ఇస్తున్నారు. అయితే, నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ సారి గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి మన నగరానికి టూరిస్టులు వస్తుంటారు. దీంతో OYO హోటల్స్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆయా హాటల్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టడం విశేషం.
Similar News
News December 26, 2024
HYD బుక్ ఫెయిర్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్
HYD ఎన్టీఆర్ స్టేడియంలో పండుగలా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనకు పుస్తకాభిమానులు తరలివస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు స్టాలు పరిశీలించారు. అనంతరం ఆయన రెంటాల జయదేవ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా మొదటి రోజుల గురించి రాసిన పరిశోధనాత్మక పుస్తకమని తెలిపారు.
News December 26, 2024
HYD: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: R.కృష్ణయ్య
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగాన్ని సవరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు HYD విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో రాష్ట్ర బీసీ లెక్చరర్స్ సంఘం సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు కే.సుదర్శన్ అధ్యక్షత వహించగా విఠల్ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా అట్రాసిటీ ప్రొటెక్షన్ కల్పించాలన్నారు.
News December 26, 2024
HYD: తెలంగాణతల్లి విగ్రహానికి రూ.150కోట్లని పిటిషన్.. వివరాలెక్కడ: హైకోర్టు
HYDలోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పునకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని జూలూరు గౌరీ శంకర్ దాఖలు చేయగా, హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విగ్రహంపై క్యాబినెట్ నిర్ణయం, రూ.150 కోట్ల వ్యయానికి సంబంధించిన వివరాలు ఎక్కడా ప్రస్తావించ లేదని వ్యాఖ్యానించింది. దీంతో పిటిషనర్ తరఫు లాయర్ మయూర్ రెడ్డి పిటిషన్ ఉపసంహరించుకున్నారు.