News March 20, 2024

హైదరాబాద్‌‌లో TAX కట్టకుంటే LOCK..!

image

ఏళ్లుగా ప్రాపర్టీ TAX కట్టని వారిపై GHMC చర్యలకు సిద్ధమైంది. మొండి బకాయిల వసూలే లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు.. తొలుత వ్యాపారసముదాయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 100కు పైగా దుకాణాలకు తాళం వేశారు. ఇటువంటి వారి కోసం OTS(వన్‌ టైమ్ సెటిల్‌మెంట్‌) స్కీమ్ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. MAR 31లోపు చెల్లిస్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. పన్ను కట్టని నిర్మాణాలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Similar News

News January 15, 2025

HYD: పేరుకే చైనా మాంజా.. తయారీ ఇక్కడే..!

image

చైనీస్ మాంజా అందుబాటులో ఉండడానికి అసలైన కారణం మన ప్రాంతాల్లోనే తయారు చేస్తున్నట్లు HYD సీపీ ఆనంద్ తెలిపారు. ఈ-కామర్స్ ద్వారా ఎవరైనా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కామర్స్ గోదాములపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉందని Xలో ట్వీట్ చేశారు. నగరంలో భారీ మొత్తంలో చైనా మాంజాను పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు.

News January 15, 2025

ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News January 14, 2025

HYD: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

image

AICC నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచే వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లనున్నారు.