News April 17, 2025
హైదరాబాద్‌లో ఆందోళనలు.. పోలీసుల అప్రమత్తం!

నగరంలో కొద్దిరోజులుగా వరుస ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా చర్యలు చేపట్టారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ముస్లిం సంఘాలు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. SMలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై సైతం పోలీసులు నిఘా పెట్టారు.
Similar News
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News April 19, 2025
HYDలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్ బాపుబాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి, ముఠాలోని అవియాజ్, హుస్సేన్‌లను అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం HYDకు వచ్చిన అమాయకపు యువతులను స్వప్న అనే మహిళ ఈ కూపంలోకి దించుతోందని గుర్తించారు. ఈ ముఠాలోని లడ్డు, స్వప్న పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News April 19, 2025
HYDలో తరచూ కనిపిస్తున్న చిరుత

నగరంలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి చిరుతలు కనిపిస్తున్నాయి. మొదటిసారి 2014లో ఇక్రిశాట్లో కనిపించగా జూన్ 2019లో మళ్లీ ఇక్రిశాట్‌లో కనిపించింది. ఆ తరువాత జనవరి 2020లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో, డిసెంబర్ 2022లో హెటిరో డ్రగ్స్ ప్లాంట్‌లో, మే 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల్లో, జనవరి 2025లో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. ఇపుడు మళ్లీ ఇక్రిశాట్లో చిరుతలు కనిపించాయి.