News June 1, 2024

హైదరాబాద్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. గత MP ఎన్నికల్లో‌ రాజధాని ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. హైదరాబాద్‌లో (MIM), సికింద్రాబాద్(BJP), మల్కాజిగిరి(INC), చేవెళ్ల(BRS)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

Similar News

News September 21, 2024

HYDలో RELAX అంటూ వ్యభిచారం

image

RELAX అంటూ ఆన్‌లైన్‌లో అశ్లీల ఫొటోలు పంపి HYD‌ యువకులను ఆకర్షిస్తున్న వ్యభిచార ముఠా బాగోతం వెలుగుచూసింది. నెల్లూరు వాసి వంశీకృష్ణ, HYDకు చెందిన పార్వతి కలిసి ఈ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు పెట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు రేట్‌ ఫిక్స్ చేసి వ్యభిచారం నిర్వహించారు. నిఘాపెట్టిన CYB AHTUకి వీరికి చెక్ పెట్టింది. గతంలోనూ వీరు ప్రాస్టిట్యూషన్‌ కేసులో అరెస్ట్ అయ్యారు.

News September 21, 2024

HYD: ఇండోర్, లక్నోకు వెళ్లిన మేయర్, కార్పొరేటర్లు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్‌కి వెళ్లారు. స్టడీ టూర్‌లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

News September 21, 2024

HYD: విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: సీఎండీ

image

నూతన విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతివారం అధికారులు ఒకరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.