News February 16, 2025

హైదరాబాద్‌లో ఎన్నికల సందడి

image

HYDలో ఎన్నికల సందడి మొదలైంది. GHMCలో ఈ నెల 25న 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. BRS, BJP ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువగా ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్, MIM నుంచి ఎక్కువ మంది సభ్యులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఇక రానున్న బల్దియా ఎన్నికల‌పై INC పెద్దలు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం విశేషం. ఇప్పటివరకు BRS 2, INC నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు.

Similar News

News February 21, 2025

శుక్రవారం: HYDలో మళ్లీ తగ్గిన చికెన్ ధరలు

image

HYDలో చికెన్ ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం KG స్కిన్‌లెస్ రూ.186, విత్ స్కిన్ రూ.164 చొప్పున అమ్మకాలు జరిపారు. నేడు ఏకంగా KG మీద రూ.15 నుంచి రూ.18 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ.168, KG విత్ స్కిన్ రూ.148గా ధర నిర్ణయించారు. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 160కే అమ్మకాలు జరుపుతున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ఎంత?

News February 21, 2025

NICE: మారుతోన్న హైదరాబాద్!

image

మన హైదరాబాద్ రంగులమయంగా మారుతోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా జంక్షన్ల సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కనువిందు చేసేలా కుర్చీలు, LED లైట్లు, గ్రీనరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వేసిన పెయింటింగ్ వాహనదారుల చూపు తిప్పనివ్వడం లేదు. ముఖ్యంగా సెక్రటేరియట్‌ వద్ద మరింత ఆహ్లాదరకంగా మార్చారు. నగరంలో ఏ మూలకు పోయినా జంక్షన్లు అందంగా దర్శనమిస్తున్నాయి.

News February 21, 2025

HYD: రేపు JNTUకు హాలిడే

image

JNTU విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి ప్రతి నెల 4వ శనివారం సెలవు ప్రకటించారు. నూతన వైస్ ఛాన్స్‌లర్ కిషన్ కుమార్ ఆదేశాలతో గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వర రావు ఉత్తర్వులు విడుదల చేశారు.SHARE IT

error: Content is protected !!