News April 1, 2024
హైదరాబాద్‌లో కేటుగాళ్ల కొత్త మోసం ఇదే..!
HYDలో డబుల్ బెడ్ రూమ్ అర్హులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసానికి సైబర్ నేరగాళ్లు తెరలేపారు. డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పొందిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి రూ.1,250 ఆన్లైన్లో చెల్లిస్తే కరెంట్, నీటి సదుపాయాలు కల్పించి ఇళ్లలోకి వెళ్లడానికి సిద్ధం చేస్తామన్నారు. గృహ ప్రవేశం సమయంలో తిరిగి మీ నగదు వాపస్ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Similar News
News November 24, 2024
HYD: మహిళకు SI వేధింపులు..!
HYDలోని ఓ SI వేధిస్తున్నారని గృహిణి సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ప్రకారం.. ‘నా భర్త వేధింపులు తాళలేక PSలో ఫిర్యాదు చేశాను. అందులోని నా మొబైల్ నంబర్ తీసుకుని SI పర్సనల్ మెసేజులు చేస్తూ వేధిస్తున్నారు’ అని వాపోయారు. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అంటూ అసభ్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.
News November 24, 2024
HYD: 15 ఏళ్లు దాటితే సీజ్ చేయండి: మంత్రి
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఖైరతాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, RC సహా అన్ని పత్రాలు చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలన్నారు. 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
News November 24, 2024
HYD: మెనూ పాటించకపోతే చర్యలు: కలెక్టర్
HYD జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలకు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఫుడ్ మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, లేదంటే టీచర్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను ఆయా హెచ్ఎంలు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలన్నారు.