News February 6, 2025
హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738812829680_705-normal-WIFI.webp)
హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ. 220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ. 195 నుంచి రూ. 206, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.
Similar News
News February 6, 2025
SKLM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738828533375_51822294-normal-WIFI.webp)
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్సై సందీప్ వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన తరుణ్ (19), పాజిల్ బేగ్ పేటకు చెందిన కార్తీక్ (21) బైక్‌పై వస్తూ డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
News February 6, 2025
KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738834255488_20471762-normal-WIFI.webp)
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
News February 6, 2025
వేములవాడ: రాజన్న సేవలో జబర్దస్త్ నటులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738835169493_1259-normal-WIFI.webp)
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్‌లు దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.