News March 21, 2024
హైదరాబాద్‌లో పార్కింగ్‌పై స్పెషల్ ఫోకస్

నగరంలో ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని పూర్తి ప్రణాళికను తయారు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలపై చర్చించారు. కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు.
Similar News
News April 20, 2025
HYD: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి

క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయరలో ఆదివారం కొందరు యువకులు క్రికెట్ కోసం త్యాగి వెన్యూ గ్రౌండ్ బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ (32) ఒక్కసారి కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందినట్లు తెలుస్తోంది.
News April 20, 2025
HYDలో 2 దశాబ్దాల తర్వాత పోరు!

HYD స్థానిక కోటా MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత 22 ఏళ్లుగా ఈ స్థానం ఏకగ్రీవమే. ఈ సారి పోటీకి BJP సిద్ధమవడం విశేషం. ఈ కోటాలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. INC ఎన్నికకు దూరం ఉండగా.. BRS ఏకంగా పోలింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 23న MIMతో BJP పోటీ పడుతోంది.
News April 20, 2025
HYD: రెసోనెన్స్ విద్యార్థుల జయకేతనం

JEE మెయిన్స్-2025 ఫలితాలలో రెసోనెన్స్ విద్యార్థులు సత్తా చాటారు. మెయిన్స్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. అర్చిస్మాన్ అనే స్టూడెంట్ 295 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది.