News March 10, 2025
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కోనసీమ కుర్రాడు మృతి

పి.గన్నవరం మండలం జొన్నల్లంక చెందిన సందాడి సాయి వెంకటకృష్ణ (20) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. బైక్‌పై వస్తుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని కుటుంబీకులు తెలిపారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మణికంఠ లక్ష్మీసాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల ఈ యువకులు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News March 10, 2025
కోర్టులో జడ్జి ముందు ఒక్కసారిగా విలపించిన నటి!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కెంపెగౌడ విమానాశ్రయంలో దొరికిపోయిన నటి రన్యారావు కోర్టులో ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. న్యాయమూర్తి ముందు కన్నీరు పెట్టుకున్నారు. కస్టడీలో అధికారులు తనను మానసికంగా హింసించారని, దుర్భాషలాడారని ఆరోపించారు. మరోవైపు విచారణకు రన్య సహకరించడం లేదని కోర్టుకు DRI వెల్లడించింది. హింసించారన్న ఆమె ఆరోపణ అవాస్తవమని పేర్కొంది.
News March 10, 2025
రేపు SRM యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు

AP: అమరావతి నీరుకొండలోని SRM యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ అనే వర్క్‌షాప్‌లో సా.4.30 గంటలకు సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీ ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా SRMలోని పలు భవనాలను సీఎం ప్రారంభిస్తారు.
News March 10, 2025
అప్పుడు హాస్యాస్పదం.. ఇప్పుడేమో!

ఈజీగా మనీ సంపాదించవచ్చు అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో IPS అధికారి రమేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘లలిత జువెల్లరీ ఓనర్ కిరణ్ డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని చెప్పే వ్యాఖ్యలు చాలా మందికి హాస్యాస్పదం అనిపించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక నేరాలు చూస్తుంటే ఇదే వేద వాక్కు అనిపిస్తుంది. అత్యాశకు పోయి డబ్బు సంపాదించుకోవాలని అనుకునేవారు ఓ సారి పునరాలోచించండి’ అని పేర్కొన్నారు.